chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

BAPATLA LOCAL NEWS:బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా కవయిత్రి మొల్లమ్మ జయంతి

బాపట్ల: తెలుగు సాహితీ వనంలో అసామాన్య కీర్తిని గడించిన మహా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్లమ్మ) జయంతి వేడుకలను బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ (ఐపీఎస్) ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో, సిసిఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్ పాల్గొని మొల్లమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఆర్.ఐ. షేక్ మౌలుద్దీన్ తో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

BAPATLA LOCAL NEWS:బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా కవయిత్రి మొల్లమ్మ జయంతి

యువతకు స్ఫూర్తిదాయకం ఆమె జీవితం.. ఈ సందర్భంగా డీఎస్పీ జగదీష్ నాయక్ మాట్లాడుతూ.. సామాన్య కుమ్మరి కుటుంబంలో జన్మించిన మొల్లమ్మ అసాధారణ కీర్తిని సొంతం చేసుకోవడం ప్రతి ఒక్కరికీ గర్వకారణం అన్నారు. ఉమ్మడి కడప జిల్లా గోపవరం గ్రామంలో కేసన శెట్టి దంపతులకు జన్మించిన ఆమె ఎంతో స్వతంత్ర భావాలతో పెరిగారని గుర్తుచేశారు. 16వ శతాబ్దంలో మహిళలకు విద్య, సాహిత్యం అంత సులభం కాని ఆ రోజుల్లోనే, తన కవితా శక్తితో శ్రీకృష్ణదేవరాయల వంటి మహారాజుల ఆస్థానంలో ప్రశంసలు పొందడం ఆమె పట్టుదలకు నిదర్శనమని కొనియాడారు. పరిమిత వనరులున్న ఒక చిన్న గ్రామంలో పుట్టి, ఉన్నత స్థాయికి ఎదిగిన మొల్లమ్మ జీవితం నేటి యువతకు, ముఖ్యంగా మహిళలకు గొప్ప స్ఫూర్తిదాయకమన్నారు.

BAPATLA LOCAL NEWS:బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా కవయిత్రి మొల్లమ్మ జయంతి

సామాన్యుల భాషలో ‘మొల్ల రామాయణం’.. మొల్లమ్మ రచించిన ‘మొల్ల రామాయణం’ కృతి తెలుగు సాహిత్యంలో ఒక విప్లవమని డీఎస్పీ అభివర్ణించారు. పండితులకే పరిమితమైన రామాయణాన్ని సామాన్యులకు సైతం ఇట్టే అర్థమయ్యేలా అత్యంత సరళమైన వాడుక భాషలో, రమణీయమైన శైలిలో ఆమె రచించారని ప్రశంసించారు. లక్ష్యం పట్ల అంకితభావం, అకుంఠిత దీక్ష ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించి విజయం సాధించవచ్చని ఆమె నిరూపించారని తెలుపుతూ వినమ్ర పూర్వకంగా నివాళులర్పించారు.Bapatla Local News

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker