
తెనాలి (గుంటూరు): ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చరిత్రలో చిరస్మరణీయమని తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ నాయకులు కొనియాడారు. సోమవారం తెనాలిలో పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోస్ రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పలువురు ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు మరియు కూటమి నాయకులు హాజరై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ ఉత్సవంలో భాగంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదేవిధంగా తెనాలిలో నివాసం ఉంటున్న పొట్టి శ్రీరాములు వంశీయులను పట్టణ ఆర్యవైశ్య సంఘ నాయకులు ఘనంగా సత్కరించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన పట్ల హాజరైన పలువురు నాయకులు మరియు ప్రజలు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.http://GUNTUR NEWS







