
నరసరావుపేట, మార్చి 16: తెలుగు ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి వేడుకలు పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు, జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల గారితో కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, 58 రోజుల పాటు కఠిన దీక్ష పూని ఆత్మత్యాగం చేసిన శ్రీరాములు గారు తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నాయకుడని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ కృతిక శుక్ల మాట్లాడుతూ, ఆయన చూపిన క్రమశిక్షణ మరియు దేశభక్తిని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొని అమరజీవికి ఘన నివాళులు అర్పించారు.http://PALNADU NEWS







