chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

REPALLE NEWS:ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో శాంత కుమార్ ఘన విజయం- రేపల్లెలో ఐఎల్ఏ (ILA) ఆధ్వర్యంలో సంబరాలు

రేపల్లె: ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ (ILA) రాష్ట్ర కన్వీనర్ గొర్రెముచ్చు శాంత కుమార్ ఘన విజయం సాధించడం పట్ల రేపల్లె కమిటీ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక న్యాయస్థాన ఆవరణలో ఐఎల్ఏ ప్రతినిధులు ఈ విజయాన్ని పురస్కరించుకుని మిఠాయిలు, పానీయాలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.

REPALLE NEWS:ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో శాంత కుమార్ ఘన విజయం- రేపల్లెలో ఐఎల్ఏ (ILA) ఆధ్వర్యంలో సంబరాలు

ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ, దళితుల హక్కుల కోసం, బహుజన వర్గాల సమస్యల పరిష్కారం కోసం శాంత కుమార్ నిరంతరం పోరాడుతున్నారని కొనియాడారు. అంబేద్కర్, ఫూలే ఆశయాలతో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్‌ను స్థాపించి, రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషిని గుర్తు చేసుకున్నారు. బార్ కౌన్సిల్‌లో ఒక ‘ప్రశ్నించే గొంతుక’ ఉండాలని ఆశించిన రాష్ట్ర న్యాయవాదులు, ప్రాధాన్యత ఓట్లతో ఆయనను గెలిపించడం అభినందనీయమన్నారు. ఈ విజయం భవిష్యత్తులో బహుజన వర్గాలు ఎదుర్కొనే సమస్యలపై పోరాడేందుకు మరింత స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

REPALLE NEWS:ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో శాంత కుమార్ ఘన విజయం- రేపల్లెలో ఐఎల్ఏ (ILA) ఆధ్వర్యంలో సంబరాలు

ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ సహాయ న్యాయవాదులు దారం సాంబశివరావు, కర్రా ఐజక్, మరియు న్యాయవాదులు నాలాది పోతురాజు, పెరికల జీవన్ కుమార్, గుజ్జర్లమూడి ప్రశాంత్ కుమార్, కంచర్ల రవికుమార్, పెద్దపల్లి జాన్ హానోక్, దోవా రమేష్, రాంజీ, ఎడ్ల గోపిరాజు, మునిపల్లి సుబ్బయ్య, గుంటూరు విజయ కుమారి తదితరులు పాల్గొన్నారు.http://BAPATLA NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker