
చీరాల: కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా దర్బార్’ కార్యక్రమం చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య గారు ముఖ్య అతిథిగా హాజరై, ప్రజల నుండి నేరుగా వినతులను స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలతో మమేకమైన ఆయన, వారి సమస్యలను ఓపికగా విని అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ.. ఈ ప్రజా దర్బార్‌లో మొత్తం 35 అర్జీలు నమోదయ్యాయని తెలిపారు. వాటిలో ప్రధానంగా ఇంటి స్థలాలు మరియు నిర్మాణాలకు సంబంధించి 17 అర్జీలు, కొత్త పింఛన్ల కోసం 14 అర్జీలు రాగా, మరో 4 అర్జీలు ఇతరత్రా సమస్యలపై అందాయని వివరించారు. ఈ సమస్యలన్నింటినీ సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన పలువురు కీలక నాయకులు, ప్రజా ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.http://BAPATLA NEWS







