chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విశాఖపట్నం జిల్లా

VISAKAPATNAM NEWS:ఆనందపురం కూడలిలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రత్యామ్నాయ ప్రణాళికకు కలెక్టర్, ఎమ్మెల్యే గంటా ఆదేశం

విశాఖపట్నం: ఆనందపురం కూడలిలో నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎన్.హెచ్.ఎ.ఐ (NHAI), పోలీస్, రెవెన్యూ అధికారులతో కలిసి వారు ఆనందపురం కూడలిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెరిగిన వాహనాల రద్దీ దృష్ట్యా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా సమగ్రమైన ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు.

ముఖ్యంగా ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు ప్రస్తుతం ఉన్న పూల మార్కెట్‌ను రైతు బజార్‌కు కేటాయించిన 95 సెంట్ల స్థలంతో పాటు, పక్కనే ఉన్న ఎస్సీ కార్పొరేషన్ స్థలానికి తరలించే అంశంపై చర్చించారు. అలాగే, ఫ్లైఓవర్ కింద ఉన్న ఖాళీ స్థలాన్ని విస్తరించి వినియోగంలోకి తీసుకురావడం ద్వారా తాత్కాలికంగా ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పరిస్థితులను సూక్ష్మంగా అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారం చూపేలా ప్రతిపాదనలు రూపొందించాలని ఎన్.హెచ్.ఎ.ఐ అధికారులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి మరియు ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.http://VISHAKAPATNAM NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker