chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విశాఖపట్నం జిల్లా

VISHAKAPATNAM LOCAL NEWS:ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు- జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్

విశాఖపట్నం, మార్చి 23 (ప్రజా ప్రతినిధి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) ద్వారా వచ్చే వినతులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించని పక్షంలో సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ముఖ్యంగా డీఎంహెచ్ఓ (DM&HO) మరియు అటవీ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న అంశాలను యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేయాలని ఆదేశించారు. పద్మనాభం మండల ఎంఆర్ఓ పరిధిలోని సమస్యలను త్వరితగతిన ముగించాలని సూచించారు. మున్సిపల్ విభాగంలో పనితీరు మెరుగుపడినప్పటికీ, కొన్ని జోన్లలో ఇంకా పురోగతి సాధించాల్సి ఉందన్నారు. ముఖ్యంగా డీఈఈ జోన్-1 లోని లోపాలను సరిదిద్దాలని, ఏసీపీ జోన్-1, జోన్-4 పరిధిలోని అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మెరుగుదల కనబరచాలని ఆదేశించారు.

విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కలెక్టర్ కొరడా ఝుళిపించారు. 21 రోజుల గడువు దాటినా ఫిర్యాదుకు పరిష్కారం చూపని ఆనందపురం మండల సర్వేయర్‌కు నోటీసులు ఇవ్వాలని, అలాగే మూడుసార్లు కంటే ఎక్కువ తప్పిదాలు చేసిన అధికారులకు వెంటనే ‘చార్జ్ మెమోలు’ జారీ చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, హౌసింగ్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని.. అధికారులు నేరుగా అర్జీదారులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించినప్పుడే పీజీఆర్ఎస్ లక్ష్యం నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు.http://VISHAKAPATNAM NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker