chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

CHIRALA LOCAL NEWS:తీర ప్రాంతాలకు పోటెత్తిన పర్యాటకులు- సముద్ర స్నానాలకు వచ్చే వారు జాగ్రత్తలు పాటించాలి – పోలీసుల విజ్ఞప్తి

చీరాల, మార్చి 23 (ప్రజా ప్రతినిధి): రంజాన్ పండుగ ముగియడం, దానికి తోడు ఆదివారం సెలవు దినం కావడంతో బాపట్ల జిల్లా చీరాల తీర ప్రాంతాలకు ముస్లిం సోదరులు మరియు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీరానికి వచ్చే సందర్శకులు తప్పనిసరిగా రక్షణ నియమాలను పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

సముద్ర స్నానాలకు వచ్చే వారు లోతట్టు ప్రాంతాలకు వెళ్లరాదని, ముఖ్యంగా మద్యం సేవించి నీటిలోకి వెళ్లడం ప్రాణాపాయానికి దారితీస్తుందని హెచ్చరించారు. పర్యాటకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సురక్షితంగా ఆస్వాదించి గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.

ట్రాఫిక్ నిబంధనలు మరియు భద్రత: తీరానికి వచ్చే వాహనదారులు అతి వేగంతో ప్రయాణించకూడదని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో వచ్చేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని పోలీసులు సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, వాహనం నడుపుతూ సెల్‌ఫోన్‌లో మాట్లాడటం వంటి చర్యల వల్ల ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని, కావున నిబంధనలు అతిక్రమించవద్దని పేర్కొన్నారు. అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

CHIRALA LOCAL NEWS:తీర ప్రాంతాలకు పోటెత్తిన పర్యాటకులు- సముద్ర స్నానాలకు వచ్చే వారు జాగ్రత్తలు పాటించాలి - పోలీసుల విజ్ఞప్తి

పిల్లల పట్ల అప్రమత్తత: దూర ప్రాంతాల నుండి వచ్చే వారు తమ వ్యక్తిగత వస్తువులతో పాటు, చిన్న పిల్లల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని, వారిని ఒంటరిగా వదలరాదని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ఇబ్బంది ఎదురైతే వెంటనే పోలీసు సహాయక నంబర్లను సంప్రదించాలని కోరారు.

ప్రస్తుతం తీర ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షించేందుకు సీఐ శేషగిరి ఆధ్వర్యంలో రూరల్ ఎస్సై చంద్రశేఖర్, వేటపాలెం ఎస్సై జనార్ధన్ మరియు పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.http://BAPATLA NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker