
రేపల్లె, మార్చి 23: బాపట్ల జిల్లా రేపల్లె రెవిన్యూ డివిజన్ కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్లడ్ కాంపోనెంట్ స్టోరేజ్ కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావనతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని రక్త నిల్వ సౌకర్యాలను, కాంపోనెంట్ స్టోరేజ్ పనితీరును వారు క్షుణ్ణంగా పరిశీలించారు.

అత్యవసర సమయాల్లో రోగులకు రక్తం మరియు రక్త కణాలు సకాలంలో అందేలా చూడాలని, స్టోరేజ్ కేంద్రం నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రేపల్లె తహశీల్దార్ శ్రీనివాస్, జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షుడు భట్టాచార్య, రెడ్ క్రాస్ సభ్యులు మరియు ఇతర రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.http://BAPATLA NEWS







