chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

BAPATLA LOCAL NEWS:పారిశుద్ధ్య పనులపై బాపట్ల మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

బాపట్ల, మార్చి 24: పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పనుల తీరును బాపట్ల మున్సిపల్ కమిషనర్ శ్రీ జి. రఘునాధ రెడ్డి స్వయంగా పరిశీలించారు. మంగళవారం తెల్లవారుజాము నుండే ఆయన పలు వార్డుల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను తనిఖీ చేస్తూ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. మొదటగా కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ రోడ్డులో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఆయన, చెత్త సేకరణలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని కార్మికులకు సూచించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని పేర్కొంటూ, విధుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

BAPATLA LOCAL NEWS:పారిశుద్ధ్య పనులపై బాపట్ల మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

అనంతరం, రాబోయే ఈస్టర్ పండుగను దృష్టిలో ఉంచుకుని చెంగల్రాయుడు తోట మరియు బృందావనం శ్మశాన వాటికలను కమిషనర్ సందర్శించారు. పండుగ నాటికి శ్మశాన వాటికల పరిసరాల్లో పొదలు, మురుగును తొలగించి, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే జమ్ములపాలెం మెయిన్ రోడ్, రాజీవ్ గాంధీ కాలనీల్లో జరుగుతున్న డ్రైనేజీల డీ-సిల్టేషన్ పనులను పరిశీలించి, నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా పూడిక తీయాలని స్పష్టం చేశారు.

BAPATLA LOCAL NEWS:పారిశుద్ధ్య పనులపై బాపట్ల మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

వర్షాకాలం ముందే అన్ని ప్రధాన డ్రైన్లను శుభ్రం చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పర్యటనలో శానిటరీ ఇన్స్పెక్టర్లు సయ్యద్ నజీర్, చేవూరి కరుణా మరియు ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారుhttp://BAPATLA NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker