
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి సుల్తానాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్న ‘ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్’ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీల ఏర్పాట్లను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రారంభం కానున్న ఈ పోటీలు వారం రోజుల పాటు మొత్తం ఏడు విభాగాల్లో అత్యంత వైభవంగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఎడ్ల బల ప్రదర్శనతో పాటు పశుపాల ప్రదర్శన మరియు వ్యవసాయ ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ నెల 29న నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, సంధ్యారాణిలతో పాటు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు హాజరవుతారని ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. ప్రాంగణంలోని ఏర్పాట్లపై పార్టీ నాయకులు, కమిటీ సభ్యులతో చర్చించిన ఆయన, ఈ జాతీయ స్థాయి ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు.http://GUNTUR NEWS







