
అమరావతి: మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో చోటుచేసుకున్న భీకర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిర్మల్ నుండి నెల్లూరు వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు, టిప్పర్‌ను ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం పట్ల ఆయన దిగ్భ్రాంతి చెందారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, ఘటనాస్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు.

ప్రమాదంలో గాయపడిన సుమారు 20 మంది ప్రయాణికులను తక్షణమే సమీప ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, తక్షణమే నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.http://AMARAVATHI NEWS







