
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (APREIS) ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. గుంటూరు జిల్లా కన్వీనర్ ఎం. రజిని తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నగరంలోని నందివెలుగు రోడ్డు (సుభాష్ నగర్) లోని ఉర్దూ బాలుర గురుకుల పాఠశాల, అలాగే సంగడిగుంటలోని బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాలతో పాటు, 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఇంటర్మీడియట్ ప్రవేశాలు మరియు ముఖ్య తేదీలు
పాఠశాలలతో పాటు ఉర్దూ బాలుర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (MPC, BiPC, CEC) గ్రూపుల్లో ప్రవేశాలకు కూడా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 7, 2026
- ప్రవేశ పరీక్ష తేదీ: ఏప్రిల్ 24, 2026
- అర్హులు: ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్ మరియు బౌద్ధ మైనారిటీ విద్యార్థులు.
ఆసక్తి గల విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం పని దినాలలో 8712625038, 8712625039, 8712625073 నంబర్లను సంప్రదించవచ్చని జిల్లా కన్వీనర్ తెలిపారు.http://GUNTUR NEWS







