
విశాఖపట్నం తీరానికి భారీ ఎల్‌పీజీ మరియు చమురు నౌకలు చేరుకోవడం స్థానిక యంత్రాంగానికి పెద్ద ఊరటనిచ్చింది. చమురు, గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో, భారీ నిల్వలతో ఈ నౌకలు రావడం గమనార్హం. ప్రధానంగా ‘బిర్చ్’ అనే భారీ ఎల్‌పీజీ నౌక హార్బర్ మౌత్‌కు చేరుకుని అక్కడ లంగరు వేయగా, ‘ఎంటీ పెట్రాయిట్’ అనే చమురు నౌక ఇప్పటికే విశాఖ పోర్టుకు చేరుకుంది. ఈ భారీ నిల్వల రాకతో ఇంధన కొరత తీరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.VISHAKAPATNAM NEWS:సింహాచలం చందనోత్సవ ఏర్పాట్లపై ఇన్చార్జి మంత్రి సమీక్ష







