chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍ఎలూరు జిల్లా

DHARMAJIGUDEM NEWS:చింతలపూడిలో ఆధ్యాత్మిక శోభ- రామాలయాల్లో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ప్రత్యేక పూజలు

ధర్మాజీగూడెం: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం తన స్వగ్రామమైన ధర్మాజీగూడెంలోని కోదండరామాలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్మాన్ని కాపాడేందుకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజాపాలకుడు శ్రీరాముడని, సీతారాముల పవిత్ర బంధం భవిష్యత్తు తరాలకు ఆదర్శనీయమని పేర్కొన్నారు. శ్రీరాముని ఆశీస్సులతో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం వెల్లివిరియాలని, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

DHARMAJIGUDEM NEWS:చింతలపూడిలో ఆధ్యాత్మిక శోభ- రామాలయాల్లో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ప్రత్యేక పూజలు

అనంతరం ధర్మాజీగూడెం హైస్కూల్ రోడ్డులోని శ్రీ సీతారామాంజనేయ ఆలయం, తూర్పువీధిలోని సీతారామాలయం, పడమట వీధిలోని కోదండ సీతారామాలయంతో పాటు కాటమరెడ్డిపల్లిలోని రామాలయాన్ని కూడా ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ప్రతి ఒక్కరూ శ్రీరామచంద్రమూర్తి సుగుణాలను అలవర్చుకుని ఆదర్శ జీవితం గడపాలని, రామరాజ్య స్థాపనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.http://ELURU DISTRICT NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker