
ఏలూరు జిల్లా కోర్టులో జరిగిన న్యాయవాద సంఘం ఎన్నికల్లో జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్ జనరల్ సెక్రటరీగా 71 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్-చార్జ్ రెడ్డి అప్పల నాయుడు ఆధ్వర్యంలో జ్యోతి కుమార్ గారిని శాలువాతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ విజయం పట్ల స్పందించిన నిమ్మల జ్యోతి కుమార్.. తన గెలుపుకు సహకరించిన ఏలూరు బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు, సహచర మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తనకు అండగా నిలిచిన అబ్బినేని విజయ్ బృందానికి, రెడ్డి అప్పల నాయుడు గారికి మరియు జనసైనికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు మరియు మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలు చేసుకున్నారు.http://ELURU NEWS







