Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

CHIRALA LOCAL NEWS:చీరాలలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

చీరాల: బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని 31వ వార్డులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మాజీ కౌన్సిలర్ సల్లూరి సత్యానందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యానందం పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

CHIRALA LOCAL NEWS:చీరాలలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదల సంక్షేమం కోసం స్థాపించిన ఈ పార్టీ, నేడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కొనియాడారు. వార్డు అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రముఖులు మరియు పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని జై తెలుగుదేశం నినాదాలతో హోరెత్తించారు.http://BAPATLA NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker