ఆంధ్రప్రదేశ్గుంటూరు

అస్మిత ఖేలో ఇండియా – తైక్వాండో సిటీ లీగ్‌లో సత్తాచాటిన విజ్ఞాన్స్‌ విద్యార్థులు

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు అస్మిత ఖేలో ఇండియా – తైక్వాండో సిటీ లీగ్‌లో సత్తాచాటారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్‌ యూత్‌ అఫైర్స్, స్పోర్ట్స్, ఖేలో ఇండియా సమర్పణలో తైక్వాండో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అండ్‌ ఆంధ్రప్రదేశ్‌ తైక్వాండో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తెనాలిలోని ఎన్‌టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన అస్మిత ఖేలో ఇండియా – తైక్వాండో సిటీ లీగ్‌లో తమ వర్సిటీకు చెందిన విద్యార్థులు 11 పతకాలను కైవసం చేసుకున్నారని వెల్లడించారు. ఇందులో 1 బంగారు పతకం, 5 రజత పతకాలు, 5 కాంస్య పతకాలు ఉన్నాయని తెలిపారు. 62 కేజీల విభాగంలో అషాంటే ( మెకానికల్, మొదటి సంవత్సరం) అనే విద్యార్థిని బంగారు పతకం సాధించిందని వెల్లడించారు. 67 కేజీల విభాగంలో ఎండీ.కరిష్మా ( సీఎస్‌ఈ, రెండో సంవత్సరం), 62 కేజీల విభాగంలో పీ.వెంకట కామ్య (సీఎస్‌ఈ, మూడో సంవత్సరం), 57 కేజీల విభాగంలో ఎన్‌.యగ్నస్‌ ( బీఫార్మసీ, రెండో సంవత్సరం), 73 కేజీల విభాగంలో కళాజోత్స ్న ( సీఎస్‌ఈ, రెండో సంవత్సరం), 53 కేజీల విభాగంలో టీ.భవ్యశ్రీ ( సీఎస్‌ఈ, మొదటి సంవత్సరం) అనే విద్యార్థులు రజత పతకాలతో సత్తాచాటారని పేర్కొన్నారు. 53 కేజీల విభాగంలో కే.సాయి వర్షిణి ( సీఎస్‌ఈ డేటా సైన్స్, మొదటి సంవత్సరం), 67 కేజీల విభాగంలో ఎల్‌.తేజస్విణి (సీఎస్‌ఈ ఏఐఎంఎల్, రెండో సంవత్సరం), 46 కేజీల విభాగంలో పీ.వీణా మాధురి ( బయోటెక్నాలజీ, మూడో సంవత్సరం), 57 కేజీల విభాగంలో వీ.నిఖిల (బయోటెక్నాలజీ, రెండో సంవత్సరం), 67 కేజీల విభాగంలో సీ.పద్మిణి ( బయోటెక్నాలజీ, మొదటి సంవత్సరం) అనే విద్యార్థులు కాంస్య పతకాలు సాధించారని తెలియజేసారు. అస్మిత ఖేలో ఇండియా – తైక్వాండో సిటీ లీగ్‌లో సత్తాచాటిన విద్యార్థులను వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఫిజికల్‌ డైరక్టర్లు, విద్యార్థులు అభినందించారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button