VIJAYAWADA NEWS : పి.బి. సిద్ధార్థ జీవశాస్త్ర విభాగాల పోషకాహార ప్రదర్శన
విజయవాడ, మార్చి 18: విజయవాడ పి.బి. సిద్ధార్థ కళాశాలలో జీవశాస్త్రాల (వృక్ష,జంతు,జీవ సాంకేతిక శాస్త్రాలు) విభాగాలు, స్టూడెంట్స్ అసోసియేషన్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ సంయుక్త నిర్వహణలో మంగళవారం విక్చువల్ ఎక్స్ పో జరిగింది. ఈ పోషకాహార ప్రదర్శనను ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ ప్రారంభించారు. పోషకాహారం పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంపొందిస్తున్నామన్నారు. పోషక విలువలు ఉండే రాగి ఇడ్లీ, మిల్లెట్ అట్లు తదితర సమతుల్య ఆహారాన్ని విద్యార్ధులతో తయారు చేయించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని డైరెక్టర్, జంతుశాస్త్ర విభాగాధిపతి వేమూరి బాబూరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీన్ ఆచార్య రాజేష్ సి.జంపాల, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మనోరంజని, ఇంటర్నల్ క్వాలిటీ సెల్ కో ఆర్డినేటర్ డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్, వృక్ష విభాగాధిపతి డా. పువ్వాడ శ్రీనివాసరావు, అధ్యాపకులు డా. ఎ. సాంబానాయక్, డా. కె.రత్నకుమారి, పి. లలితాప్రియాంక, సి హెచ్. శిరీష, డి. శ్రావణి తదితరులు పాల్గొన్నారు.