GUNTUR NEWS : కొల్లిపర లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ : District Collector S. Nagalakshmi on Wednesday inspected the tenth grade examinations being conducted at the Zilla Parishad High School in Kollipara.
కొల్లిపర లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా తో కలసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ కేంద్రంలో 224 మంది విద్యార్దులకు గాను వంద శాతం పరీక్షలకు హాజరైనారని మండల విద్యాశాఖాధికారి కె.ఝాన్సీ లత జిల్లా కలెక్టర్ కు వివరించారు. పరీక్షలు వ్రాస్తున్న విద్యార్దులకు కల్పించిన మౌలిక సదుపాయాలను పరిశీలించి జిల్లా కలెక్టర్ సూచనలు జారీ చేసారు. విద్యార్దులకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ను పరిశీలించి అందులో అందుబాటులో వుంచిన మెడిసన్ ను పరిశీలించారు. ఎండాకాలం అయినందున తగినన్ని ఓఆర్ఏస్ ప్యాకెట్లు అందుబాటులో వుంచాలన్నారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా పర్యవేక్షిస్తూ పకడ్బంధీగా పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.