Guntur News : ఈ నెల 22-03-2025 వ తేదీన గుంటూరు పశ్చిమ మరియు మంగళగిరి నియోజకవర్గం నందు జాబ్ ఫెయిర్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తున్నది. దీనిలో భాగముగా నిరుద్యోగ యువతకు వారికి ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది.
గుంటూరు గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి శ్రీ కొండా సంజీవరావు గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద, జిల్లా ఉపాది కార్యాలయం మరియు సీడాప్ (SEEDAP) వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 22-03-2025 వ తేదీన గుంటూరు పశ్చిమ మరియు మంగళగిరి నియోజకవర్గం నందు జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కనుక పరిసర ప్రాంత యువతి యువకులు ఈ జాబ్ ఫెయిర్ లో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనవలసిందిగా తెలియజేశారు.
ఈ జాబ్ ఫెయిర్ కు ఎస్.ఎస్.సి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, బి.టేక్, డిప్లొమా, ఫార్మసి, మరియు పి.జి విభాగముల వరకు చదువుకున్నటు వంటి 18-35 సం||ల వయసు గల నిరుద్యోగ యువతి యువకులు వారి యొక్క బయోడేటా లేదా రెస్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్, ఆధార్ నకలు మరియు పాస్ పోర్ట్ ఫోటో తో నేరుగా ఇంటర్వ్యూ కు హాజరు కాగలరు.