పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం లో నిరుపేద,మధ్య తరగతికి వర్గాలకు చెందిన 28 మందికి ముఖ్యమంత్రి సహాయనిధిగా రూ. 12.60 లక్షలు రూపాయల చెక్కులను కూటమి నాయకులతో కలిసి శనివారం మంత్రి రామానాయుడు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధిని జగన్ రద్దు చేయగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దానిని పునరుద్ధరించి, పేద-మధ్యతరగతి వర్గాల వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నారని ఈ కార్యక్రమం కేవలం ఈ రోజే కాకుండా ఇలా ప్రతీ వారం వైద్యసాయంగా పెద్ద ఎత్తున సహాయం అందిస్తున్నామని తెలిపారు .
230 Less than a minute