Guntur News : గత వైసిపి ప్రభుత్వ వైఫల్యాలతో నేడు ప్రజాసమస్యల వెల్లువ – ఎమ్మెల్యే గళ్ళా మాధవి…
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో “ప్రజా గ్రీవెన్స్ డే” నిర్వహించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి అవినీతి, కక్ష పూరిత రాజకీయాలతో గత వైసిపి ప్రభుత్వము, స్థానిక వైసిపి ప్రజాప్రతినిధులు కాలం గడిపేసారని ఫలితంగా నేడు ప్రజల నుండి సమస్యలు వెల్లువెత్తుతున్నాయని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి బుధవారం నాడు ప్రజా గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ గ్రీవెన్స్ కు ప్రజలు మరియు తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ .ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభివృద్ధి మరియు సంక్షేమాన్ని అందించాలన్న లక్ష్యంతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.ప్రజలకు ప్రభుత్వాన్ని మరియు సేవలను మరింత చేరువ చేయటానికి ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో అనేక సేవలను అందిస్తుంది.ఈ రోజు మరో ముందడుగు వేసి ప్రతి బుధవారం గ్రీవెన్స్ డే నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ ఆదేశించటాన్ని నేను స్వాగతిస్తున్నాను.ఇప్పటికే “మీతోనే నేను – మీ వెంటనే నేను” కార్యక్రమం పేరుతో క్షేత్ర స్థాయిలో పర్యటించటంతో పాటు, వారానికి 4 రోజులు పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను.గ్రీవెన్స్ డే నిర్వహించిన ప్రతి రోజు కూడా అనేక సమస్యలతో వస్తున్నారు.ప్రధానంగా డివిజన్లలో కనీస మౌలిక సదుపాయాలు అయిన డ్రైన్లు, రోడ్లు మరియు మంచినీటి సమస్యలు తీర్చమని కోరుతున్నారు.గడిచిన 5ఏళ్ల కాలంలో వైసిపి నేతలు ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా, అవినీతిలో మునిగి తేలి ప్రజల్ని, ప్రజా సమస్యల్ని గాలికి వదిలి వేశారని, స్థానిక వైసిపి నేతలు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తిని, బిల్లులు కూడా చెల్లించకుండా వేధించారని, కాంట్రాక్టర్లు పనులు చేయాలంటే వెనకడుగు వేసేలా చేసి, నియోజకవర్గ అభివృద్ధి కుంటు పడేలాగా చేసారు.ఏదయినా ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తే కేసుల పెట్టేవారని, నేడు ప్రజా ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్చావాయువులు పీల్చుతూ, అనేక సమస్యలను మా దృష్టికి తీసుకొని వస్తున్నారు.వీటన్నిటినీ నిశితంగా పరిశీలించి, సాధ్యమైనంత వరకు ఇక్కడికి ఇక్కడే పరిష్కరించి, మిగిలినవి అధికారులకు ప్రజల అర్జీలను పంపిణీ, నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేలాగా ఆదేశిస్తున్నాము.
దీనిని వలన ప్రతి ఒక్కరూ ఇది మంచి ప్రభుత్వం అంటూ కితాబు ఇస్తున్నారని, దీనికి అనుగుణంగానే తమ పాలన ఉంటుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు సింహాద్రి కనకాచారి తదితరులు పాల్గొన్నారు.