Bapatla :బాపట్ల జిల్లా బీసీ సమన్వయ కమిటీ సమావేశం :జిల్లా చైర్మన్ పుప్పాల మురళి
ఏప్రిల్ 11 వ తారీకున మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో బీసీల సమస్యలపై కుల గణన పై గత ప్రభుత్వం చేసిన కుల గణన అనుసరించి 52% రిజర్వేషన్ కల్పించాలని ధర్నా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ బీసీ రమణ అన్నారు. మాట్లాడుతూ రాష్ట్ర అధికార ప్రతినిధి ధరణికోట లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీసీలకు 24 శాతం ఇస్తాను 34 శాతం ఇస్తాను మాయ మాటలకు కప్పిపెట్టి గత ప్రభుత్వం తీసినటువంటి బీసీ కులగణలో 52 శాతం బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీకి బీసీలు బాయ్ బాయ్ చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర మహిళా చైర్మన్ విమేశ్వర్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర మహిళా కన్వీనర్ డాక్టర్ ఉమావళి బీసీ సమన్వయ కమిటీ మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి నాగలక్ష్మి , బాపట్ల జిల్లా బిఎస్పి పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరావు , వివిధ బీసీ సంఘం నాయకులు పాల్గొనడం జరిగింది, కార్యక్రమంలో బీసీ సమన్వయ రాష్ట్ర కమిటీలోకి సంచార జాతులకు సంఘం నుంచి చల్ల రామయ్య ని రాష్ట్ర బీసీ సమన్వయ కమిటీ కోకన్వీనర్గా తీసుకోవడం జరిగింది, అదేవిధంగా బాపట్ల జిల్లా బీసీ సమన్వయ కమిటీ మహిళా చైర్మన్గా శీలం వెంకటేశ్వరమ్మ ని నియమిస్తూ నియామక అందజేయడం జరిగింది.