AP NEWS: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది -2025 సందర్బంగా ఏపీ సెక్రటేరియట్ లో ఆటల పోటీలు
SPORTS IN AP SACHIVALAYAM
ఉగాది పండుగ-2025 శుభ సందర్బాన్ని పురస్కరించుకొని ఏ పీ యస్ పి యఫ్ గౌరవ డిజీ డాక్టర్ త్రివిక్రమ్ వర్మ మరియు ఐజీ బి వి రామిరెడ్డి సూచనలు మేరకు విజయవాడ జోన్ కమాన్ డెంట్ ముద్దాడ శంకర రావు ఆధ్వర్యంలో ఏపి సెక్రటేరియట్ CSO పి. వి. ఎస్. ఎన్.మల్లికార్జున రావు వారి పర్యవేక్షణలో ఏపి సెక్రటేరియట్ అమరావతి లో గత రెండు రోజులుగా వాలీబాల్ మరియు బాడ్మింటన్ ఆటలు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన కమాండంట్ ముద్దాడ శంకరర్రావు మాట్లాడుతూ నిత్యం విధి నిర్వహణలో ఎంతో ఒత్తిడి తో ఉండే యస్ పి యఫ్ సిబ్బంది ఈ ఆటల పోటీలవలన వారు శారీరకంగా మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారని తెలిపారు. డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ విజయవాడ వారి సౌజన్యంతో నిర్వహించిన ఈ ఆటలు పోటీలలో విజేతలుగా నిలిచిన జట్లుకు మరియు విజేతలుకు విజయవాడ జోన్ కమాండంట్ ముద్దాడ శంకర రావు గారు ట్రోఫీలు, మెడల్స్ మెమెంటోలు మరియు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ ఆటల పోటీలను విజయవంతంగా నిర్వహించిన CSO పి. వి. ఎస్. ఎన్.మల్లికార్జున రావు ఇన్స్పెక్టర్స్ మల్లవరపు.వెంకటేశ్వర్లు, సింగూరు రమణ లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి మేనేజర్ M.రమణ Dr. Agrawal Hospital, విజయవాడ & వంశీ Dr. Agrawal Hospital గుంటూరు, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గున్నారు.