BAPATLA NEWS: ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం
PARCHURU MLA PROGRAME
ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివారం ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సిఫారసు మేరకు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన పలువురికి సీఎం సహాయ నిధి నుంచి సీఎంఆర్ చెక్కులను అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నియోజకవర్గంలోని అర్హులైన పేదలకు 43 మందికి 22, 82,304 చెక్కులను అందించినట్లు ఎమ్మెల్యే ఏలూరి తెలిపారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పర్చూరు నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి సహాయ నిధి 317 మందికి 3,60,22,467 రూపాయలు అందించినట్లు వెల్లడించారు. గతం వైసిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎన్నో వేల కోట్ల రూపాయలు పేదలకు ఉచితంగా ఇస్తున్నామని గొప్పలు చెప్పి పేదలకు ఉపయోగపడే సీఎం సహాయ నిధిని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. కనీసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులకు కూడా ఏ ఒక్కరికి కూడా లబ్ధి చేయనివ్వకుండా కక్షపూరితంగా వ్యవహరించిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా రాజకీయానికి తావు లేకుండా అర్హులైన పేదలందరికీ ముఖ్యమంత్రి సహాయనిధి అందిస్తుందన్నారు. మూడవసారి ఎమ్మెల్యేగా నన్ను మీ ప్రతినిధిగా ఎన్నుకొని పెద్ద బాధ్యత నాపై ఉంచారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని మీరందరూ అండగా ఉన్నారని గుర్తు చేశారు. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి ప్రాంత ప్రజల శ్రేయస్సుకి నా శక్తివంతన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే ఏలూరి అన్నారు.