ఆంధ్రప్రదేశ్
Bapatla News : బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం పదగంజాం గ్రామ పంచాయతీ కొత్తగొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం పదగంజాం గ్రామ పంచాయతీ కొత్తగొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛను పంపిణీ చేశారు. ఆయా కుటుంబాలతో మాట్లాడి వారి జీవన స్థితిగతుల గురించి తెలుసుకున్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపి, జిల్లా ఉన్నతాధికారుల, నాయకులు స్వాగతం పలికారు.