Guntur News : విజ్ఞాన్స్ ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో ప్లాంటేషన్ ప్రోగ్రామ్
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ ఫార్మసీ కళాశాలలోని ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నారాకోడూరులోని సీఎంఎస్ చిల్డ్రన్ హోమ్‌లో ప్లాంటేషన్ ప్రోగ్రామ్‌ను నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీ.శ్రీనివాసబాబు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీఎంఎస్ చిల్డ్రన్ హోమ్‌లో మొక్కలు నాటడంతో పాటు విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, పెన్నులు, బుక్స్, టవాళ్లు, ఇతర విద్యాసామాగ్రిని అందజేసామని తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కలిగించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కళాశాలలోని ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు మొక్కల ప్లాంటేషన్ కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ అనేది యువతలో సామాజిక బాధ్యతలు పెంచే ముఖ్యమైన పాత్రను పోషిస్తుందన్నారు. అంతేకాకుండా దేశంలో యువతకు సేవా కార్యాలయాలపై అవగాహన కలిగేలా, సామాజిక చైతన్యం పెంచే మార్గంగా పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.