Guntur News : పురుగు మందుల వాడకంపై అవగాహన సదస్సు
ఎన్విరో ఈక్విటీ హెల్త్ ఇన్షియేటీవ్ స్వచ్చంద సేవా సంస్థ, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పురుగు మందులు సురక్షితంగా వాడండి – ఆరోగ్యంగా ఉండండి అనే పేరుతో లాం, జొన్నలగడ్డ కు చెందిన
రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
పంటల దిగుబడుల కోసం పురుగు మందుల వాడకం పెరిగిపోయిందని ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏడీఆర్ దుర్గాప్రసాద్ తెలిపారు. ఎన్విరో ఈక్విటీ హెల్త్ ఇన్షియేటీవ్ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో లాం,
జొన్నలగడ్డకు చెందిన రైతులకు పురుగు మందుల వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. దుర్గాప్రసాద్ తోపాటు ఫౌండర్ శ్రియ జొన్నకూటి, వ్యవసాయ శాస్త్రవేత్తలు సాంబశివరావు, డయానా పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. పురుగు మందులు ఎక్కువగా వినియోగిస్తున్న దేశాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తారని దుర్గా ప్రసాద్ తెలిపారు.
మన దేశంలో మాత్రం ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా ఫెస్టిసైడ్ వాడుతున్నారని చెప్పారు. దీని వల్ల అనేక దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలాంటి తరుణంలో రైతులను అప్రమత్త చేసే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు.
వ్యవసాయ రంగంలో
త్వరలో డ్రోన్ టెక్నాలజీ రానుందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా సంస్థ ఫౌండర్ శ్రియ జొన్నకూటి మాట్లాడుతూ పురుగు మందులు వాడడం వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయని అన్నారు.
రక్షణ కవచాలు ఉపయోగించని పక్షంలో అనేక అనర్ధాలు కలుగుతాయని చెప్పారు. పురుగు మందులు వాడకంలో జాగ్రత్తలు తీసుకోని పక్షంలో మనిషిలోని అవయవాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్, అలర్జీ, మెదడు, నరాల సంబంధమైన జబ్బులు తోపాటు గర్భంలో బిడ్డలకు కూడా ప్రమాదం పొంచి ఉందన్నారు. భర్తలు పురుగు మందులు వినియోగిస్తున్న కారణంగా భార్య గర్భవతి అయితే ఆ ప్రభావం పుట్టే బిడ్డలు పైన పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పుట్టిన దగ్గర్నుంచి
పిల్లల ఎదుగుదలపై ఈ ప్రభావం చూపుతుందన్నారు.
పెస్టిసైడ్ తీసుకుని వెళ్లే సమయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పురుగు మందులు వాడిన అనంతం డబ్బాలు భూమిలో పాతిపెట్టాలన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు తోపాటు భవిష్యత్తులో
రైతులకు ఆరోగ్యంగా వుండేందుకు
పూర్తి సహాయ సహకారాలు అందిస్తామి శ్రియ ప్రకటించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు సాంబశివరావు,
డయానా మాట్లాడుతూ
వంద మందిలో ఒకరికి మాత్రమే గతంలో క్యాన్సర్ ఉండేదని అయితే ప్రస్తుతం ప్రతి ఇంటిలో ఒకరికి క్యాన్సర్ వస్తోందని చెప్పారు. రైతులకు ఎక్కువగా ప్రోస్టేట్ క్యాన్సర్, చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయన్నారు. పురుగు మందుల వాడకం తగ్గించడం, లేదా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. పూర్వ కాలంలో మలేరియా నివారణలో భాగంగా దోమల నియంత్రణకు
DDT, BHC వంటి పురుగు మందులు వినియోగించారని చెప్పారు. అలాంటి పురుగు మందులు ప్రస్తుతం చీడ పీడల నియంత్రణ కోసం పంటలకు వినియోగిస్తున్నారని తెలిపారు. పరిధికి మించి పురుగు మందులు వేయకూడదన్నారు.
భవిష్యత్తులో అనేక విధాలుగా నష్టం జరుగుతుందని తెలిపారు. ఈ విషయంపై రైతులు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ మాజీ ఉపసర్పంచ్, ఆదర్శ రైతు వంగా నవీన్ రెడ్డి, లాం జనసేన పార్టీ నాయకులు ఎం. సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.