Guntur News : ఆకట్టుకున్న వివా విద్యార్థుల “రోబోటిక్స్ ప్రాజెక్ట్స్ ఎక్స్పో”
వివా ది స్కూల్ నందు ఎడ్యూబెక్ ఇన్నోవేషన్స్ సంస్థ ఆధ్వర్యంలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోటిక్స్ ప్రాజెక్ట్ ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటర్ నెట్ ఆఫ్ థింక్స్. 3డీ ప్రింటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్యార్థులు రూపొందిచిన నమూనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులు వాస్తవ ప్రపంచ సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేలా సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలతో 55 వినూత్న ప్రాజెక్టలను ఈ ఎక్సపోలో ప్రదర్శించారు. విద్యార్థులకు ఉపయోగపడేలా హ్యాండ్ రైటింగ్ మెషిన్, స్మార్ట్ మిర్రర్, రైతులకు ఉపయోగపడేలా ఆటోమేటిక్ ప్లాంట్ వాటరింగ్ సిస్టమ్ లు ఆకట్టుకున్నాయి. ప్రదర్శనలో పాల్గొని ప్రాజెక్టు లను రూపొందించిన విద్యార్థులను చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, తల్లిదండ్రులు అభినందించారు. ఈ సందర్భంగా వివా ప్రిన్సిపల్ చదలవాడ సరళ మాట్లడుతూ వివా స్కూల్ ఆధునిక సాంకేతికతను విద్యార్థులకు అందించేందుకు గాను వారిలోని నైపుణ్యాలను పెంపొందించేలా ప్రాజెక్ట్స్ ఎక్స్ పో నిర్వహించడం జరిగిందని తెలిపారు. సృజనాత్మకత, సాంకేతికతతో విద్యార్థులు అద్భుత ప్రాజెక్టులను రూపొందించారని అన్నారు. ఎడ్యుటెక్ ఇన్నోవేషన్ ప్రతినిధి కె. కళ్యాణ్ మాట్లడుతూ భవిష్యత్ సాంకేతికతను విద్యార్థులకు అందించేలా 6 నుండి 9వ తరగతి విద్యార్థులకు ప్రాగ్రామ్ రూపకల్పన చేయడం జరిగిందనీ, ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులకు మిషన్ లెర్నింగ్, ఐఓటి, ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి సాంకేతికత పై శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎలిటి కమాండర్ కె.ఎస్. రావు, సిబిఎస్ఈ సంధానకర్త జ్యోతి మెటిల్డా, పివైపి సంధానకర్త కే.మాధవి, తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు.