బాబు జగజీవన్ రామ్
భారత మాజీ ఉపప్రదాని జగజీవన్ రామ్ 118 వ జయంతి సీపీఎం కార్యాలయంలో ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో నిర్వహిచటం జరిగింది. ముందుగా బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి సిపిఎం నాయకులు జి.దానియేల్ పూలమాలవేసి నివాళులు తెలియచేశారు , అనంతరం సీపీఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ భారత ఉపప్రధానిగా,కార్మికశాఖ మంత్రిగా తన సేవలని భారతదేశ ప్రజలుకోసం, వెనకబడినా దళితులు కోసం ఉపయోగించినా మహోన్నత వ్యక్తి , 33 సం రాలు పాటు పార్లమెంట్ సభ్యులుగా ప్రజాసమస్యలపై పూర్తి అవగాహనతో ముందుకు నడిచినా నేత,స్వాతంత్ర్య ఉద్యమంలో ఉండి జాతీయ నేతగా గుర్తింపుపొందారు.నేడు దేశంలో బాబు జగజీవన్ రామ్ గారి స్పూర్తితో సామాజిక సమస్యలు మీద,సామాజిక, అభ్యదయ ఉద్యమకారలు ఐక్యంగా ముందుకు రావాలని అన్నారు,రాజ్యాంగ హక్కులపై జరిగే దాడి మరియు రిజర్వేషన్లుకు ఇబ్బంది కలిగించే, ప్రవేటికరణ విధానాలు మీద జరిగే పోరాటాలో ప్రజలంతా ముందుకు రావాలి అని అన్నారు .