అంతర్జాతీయస్థాయి ఫెన్సింగ్ క్రీడల్లో సైతం అత్యుత్తమంగా రాణించి రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచాలని భీమవరానికి చెందిన ఫెన్సింగ్ క్రీడాకారిణి మంతెన ధృతి సమీక్షను శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు సూచించారు. విజయవాడలోని శాప్ కార్యాలయంలో శాప్ ఛైర్మన్‌ను గురువారం ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఒరిస్సా రాష్ట్రం కటక్‌లోని జేఎన్ ఇండోర్ స్టేడియంలో మార్చి 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ జరిగిన 26వ జాతీయ సబ్ జూనియర్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఫాయిల్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించినట్లు క్రీడాకారిణి వివరించారు. ఈ సందర్భంగా క్రీడాకారిణిని శాప్ ఛైర్మన్ అభినందిస్తూ ప్రభుత్వం పరంగా శాప్ నుంచి పూర్తి సహాయసహకారాలు అందిస్తామని, భవిష్యత్తులో అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ఏపీ సత్తా చాటాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఫెన్సింగ్ కోచ్ జీఎస్‌వీ కృష్ణమోహన్, భీమవరం ఫెన్సింగ్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
237 Less than a minute