తాడికొండ మండలం పొన్నేకల్లు గ్రామంలో డా.బి.ఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు తో కలిసి పరిశీలించారు. ఏప్రిల్ 14 వ తేది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు పొన్నెకల్లు గ్రామం ఎస్సీ కాలనీలో వున్న డా.బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళి అర్పిస్తారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పొన్నెకల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను ఇన్చార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ ముఖ్యమంత్రి కార్యక్రమం నిర్వహణకు సంబంధించి అధికారులు చేపట్టవలసిన పనులపై సూచనలు , సలహాలు అందజేశారు. శానిటేషన్ , వాహనాల పార్కింగ్, బ్యారీకేడ్ పనులను సజావుగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పాల్గొనే అతిధులకు, స్థానిక ప్రజలకు స్నాక్స్, మంచి నీరు వంటివి అందించేందుకు తగు చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమం ప్రారంభం నుండి పూర్తి అయ్యేవరకు నిరంతర విద్యుచ్చక్తి సరఫరాకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పొన్నేకల్లు గ్రామంలో రాష్ట్ర స్థాయి డా.బి.ఆర్.అంబేడ్కర్ గారి జయంతి ఉత్సవాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న దృష్ట్యా అధికారులందరు సమన్వయంతో , క్రమశిక్షణతో కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో పేదరికం లేకుండా రూపు మాపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేపట్టిన పి4 మార్గదర్శి-బంగారు కుటుంబం కాన్సెప్ట్ తో కార్యక్రమం జరుగనున్నందున అందుకు తగ్గ ఏర్పాట్లను సజావుగా పూర్తి చేయాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ అధికారులను ఆదేశించారు.
229 1 minute read