GUNTUR NEWS: భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న మహాశక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్.. ఎమ్మెల్యే గళ్ళా మాధవి
AMBEDKAR RALLY IN GUNTUR
భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న మహాశక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని.. ఆయన భావాలకు మరణం లేదని అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. ఆదివారం గుంటూరు లాడ్జి సెంటర్ లో భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖా నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ గుంటూరు మరియు గుంటూరు నగర పాలక సంస్థ సంయుక్త ఆద్వర్యంలో డా. బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు స్థానిక డా. బి ఆర్ అంబేద్కర్ విగ్రహం, లాడ్జ్ సెంటర్ కూడలిలో ఘనంగా జరిగాయి. తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. అనంతరం నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాజ్య సంచాలకులు అంశుమాన్ ప్రసాద్ దాస్ రాజ్యాంగ ప్రవేశకను పాల్గొన్న అందరిచే చదివించగా, రాజ్యాంగం ప్రాధాన్యం, అంబేద్కర్ ఆశయాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ గుంటూరు డా. బి ఆర్ అంబేద్కర్ విగ్రహం, లాడ్జ్ సెంటర్ నుండి ఎం టి ఆర్ స్టేడియం వరకు జరిగిన పాదయాత్రకు గళ్ళా మాధవి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 5 కి మీ జరిగిన ఈ పాద యాత్రలో సుమారు 600 మంది పైగా పాల్గొని నినాదాలు ప్లకార్డులతో ఉత్సహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ…. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మరియు సర్వ శ్రేష్ఠ మైన రాజ్యాంగాన్ని భారతీయులకు అందించిన ప్రపంచ మేధావి, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. కమీషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ… డా. బి ఆర్ అంబేద్కర్ విద్యను వ్యాప్తి చేయడం, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం, అణగారిన వర్గాల వివక్షను దూరం చేయడం, సామాజిక న్యాయం కోసం పోరాడారు అని అన్నారు.