మంగళగిరిలో ఏడాదిలో 3 వేల మందికి తెలిపారు. ‘మన ఇల్లు- మన లోకేశ్’ తొలి ఇంటి పట్టాలు ఇచ్చినట్లు మంత్రి నారా లోకేశ్ దశ చివరి రోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇక్కడి పేదలకు రూ.వెయ్యి కోట్ల విలువైన భూమి ఇచ్చినట్లు చెప్పారు. ఈ ప్రాంత ప్రజల ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. మంగళగిరి.. అన్ని రంగాల్లో ముందుండేలా చూసే బాధ్యత తనదని పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము సొంత నిధులతో 26 కార్యక్రమాలు చేపట్టామని మంగళగిరి అభివృద్ధికి తీసుకొచ్చే జీవోలు రాష్ట్రమంతటికీ పనికొస్తున్నాయి. మంగళగిరి-తెనాలి మధ్య పీపీపీ మోడ్లో తొలి 4 లేన్ల రోడ్డు నిర్మించనున్నాం. ఇక్కడ కృష్ణా నది వెంట రూ.300 కోట్లతో రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయనున్నాం. త్వరలోనే మహానాడు కాలనీ రిటైనింగ్ వాల్ పనులు ప్రారంభిస్తాం. జూన్ నుంచి భూగర్భ డ్రైనేజ్, గ్యాస్, విద్యుత్ ప్రాజెక్టు పనులు చేపడతాం. ఇళ్ల పట్టాలకు రెండు వారాల్లో రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు రెండేళ్లలో అమ్ముకునే హక్కు కల్పిస్తాం” అని లోకేశ్ తెలిపారు. మరోవైపు మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రికి నారా లోకేశ్ భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దీని నిర్మాణం చేపట్టారు. అత్యాధునిక వసతులతో ఏడాదిలోగా ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. అనంతరం టిడ్కో నివాసాల వద్ద దివిస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సురక్షిత తాగునీటి పథకాన్ని లోకేశ్ ప్రారంభించారు.
231 1 minute read