ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర జల వనరులు,సాంఘిక సంక్షేమం,హోం,పర్యాటక శాఖల మంత్రులు నిమ్మల రామానాయుడు, డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, కందుల దుర్గేశ్ మీడియాకు వివరించారు. 1.సాంఘిక సంక్షేమం: సమాజంలో వివిధ ఉప కులాల మధ్య ఏకీకృత మరియు సమానమైన పురోగతి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల మధ్య ఉప-వర్గీకరణను అమలు చేయటానికి సాంఘిక సంక్షేమ శాఖ చేసిన ముసాయిదా ఆర్డినెన్స్ ప్రతిపాదనకు రాష్ట్ర మండలి ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణను అమలు చేయడానికి చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించింది. సమాజంలో అన్ని షెడ్యూల్డ్ కులాల వర్గాల ఏకీకృత మరియు సమాన ప్రగతిని నిర్ధారించడమే ఈఆర్డినెన్స్ ముఖ్య ఉద్దేశ్యం.
రాష్ట్రంలోని 59 షెడ్యూల్డ్ కులాలను జనాభా,వెనుకబాటుతనం మరియు సామాజిక సమైక్యతల ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది. ఈ మూడు కేటగిరీలకు రిజర్వేషన్ల శాతం క్రింది విధంగా నిర్ణయించబడింది. గ్రూప్-I (12 కులాలు): 1% రిజర్వేషన్ • బవురి, చచాటి, చండాల, దండాసి, డొమ్, ఘాసి, గొడగలి, మెహతర్, పాకి, పామిడి, రెల్లి, సాప్రు. గ్రూప్-II (18 కులాలు): 6.5% రిజర్వేషన్. అరుంధతీయ, బిందల, చమార్, చంభార్, దక్కల్, ధోర్, గొదారి, గోసంగి, జగ్గాలి, జంబువులు, కొలుపులవండ్లు, మాదిగ, మాదిగ దాసు, మాంగ్, మాంగ్ గరోడి, మాతంగి, సమగార, సింధోలు. గ్రూప్-III (29 కులాలు): 7.5% రిజర్వేషన్