AP NEWS: రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో 16 వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, సభ్యుల సమావేశం
FINANCE MEETING WITH POLITICAL LEADERS
రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16 వ ఆర్థిక సంఘం ఛైర్మన్ డా. అరవింద్ పనగారియా, సభ్యులు డా. మనోజ్ పాండా, అన్నే జార్జ్ మాథ్యూ లతో వివిధ రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను ముఖాముఖి సమావేశంలో తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ వి. చిరంజీవి రావు, మాజీ శాసనమండలి సభ్యులు పి. అశోక్ బాబు లు మాట్లాడుతూ 15 వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో రాష్ట్ర రెవెన్యూ లోటు ను పరిగణలోకి తీసుకుందన్నారు. 16 వ ఆర్థిక సంఘం కూడా రెవెన్యూ లోటు ను పరిగణలోకి తీసుకోవాలన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. సెక్టార్ల వారీగా గ్రాంట్స్ ను విద్య, ఆరోగ్య రంగాలకు అందివ్వాలన్నారు. దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే విషయం గుర్తించాలన్నారు. పాపులేషన్ లెక్కలను కూడా 1971 జనాభా లెక్కల ప్రకారంగా సిఫార్సులు ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. పాపులేషన్ గ్రోత్ రేట్ ఆధారంగా నిధులు పంపకాలు ఉండాలన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ వాటా పెంచాలన్నారు. రాష్ట్రంలో వెనుకబడి ఉన్న ప్రాంతాలకు నిధులు పెంచాలన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు నిధులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలకు ప్రత్యేక నిధులు అందించాలన్నారు. జనసేన పార్టీ ప్రతినిధులుగా శాసనసభ్యులు మండలి బుద్ద ప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాస్ లు మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. రాష్ట్రానికి వెనుకబడిన రాష్ట్రాలకు ఇచ్చే విధంగా ఆర్థిక సాయం అందించాలని కోరారు. వెనుకబడిన రాష్ట్రాల జాబితాలో రాష్ట్రాన్ని చేర్చి ఆర్థికంగా చేయూతను అందించాలన్నారు. స్థానిక సంస్థల బలోపేతానికి చేయూతను అందించాలన్నారు. రాష్ట్రంలో రోడ్లు చాలా వరకు ఇబ్బందికరంగా ఉన్నాయని వాటి అభివృద్ధికి నిధుల సాయం చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న 972 కిమీ కోస్టల్ లైన్ అభివృద్ధి చేయాలన్నారు. రాష్ట్రానికి 90 శాతం గ్రాంటు గా నిధులు అందించాలన్నారు. త్రాగు నీరు, రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని నగర, గ్రామ పంచాయతీలను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. వాటర్ వర్క్స్ నిధులు, జలజీవన్ మిషన్ ఫండ్స్ రాష్ట్రానికి ఇవ్వాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ కు నిధులు పెంచాలన్నారు.వైసీపీ పార్టీ ప్రతినిధులుగా మాజీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మరియు కృష్ణ లు మాట్లాడుతూ గతంలో జనాభా, ప్రాంతాల అభివృద్ధి ఆధారంగా నిధులు అందించారన్నారు. రాష్ట్రంలో కోవిడ్ ఉన్నా కూడా వివిధ సంక్షేమ పథకాలు, కులాలకు, మతాలు, పార్టీ లకు అతీతంగా ఇచ్చామన్నారు. రాష్ట్రాలకు పన్నుల వాటాలో 50 శాతం నిధులు అందించాలన్నారు. పన్నుల వాటాలో ప్రత్యేక బోనస్ కూడా ఇవ్వాలన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాల్లో రాష్ట్రాలకు న్యాయం చేయాలి.. 14 వ ఆర్థిక సంఘంలో డాక్టర్ వైవీ రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పన్నుల వాటాను తొలిసారిగా 32 శాతం నుంచి 42 శాతం వరకు పెంచుతూ సిఫార్సు చేశారు. ఆ తర్వాత 15 వ ఆర్థిక సంఘం డాక్టర్ ఎన్కె సింగ్ ఉన్నప్పుడు 41 శాతం ఇచ్చారన్నారు.