GUNTUR NEWS: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి మార్క్ చూపిస్తాను – ఎమ్మెల్యే గళ్ళా మాధవి
DEVELOPMENT PROGRAME IN GUNTUR
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో రాబోయే రోజుల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసి, తన పనితనంతో ఎన్డీయే కూటమి అభివృద్ధి మార్క్ చూపిస్తానని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు 38వ డివిజన్ బృందావన్ గార్డెన్స్ లోని అన్నమయ్య పార్కులో వాకింగ్ ట్రాక్ చుట్టూ రిటైనింగ్ వాల్ కు ఎమ్మెల్యే గళ్ళా మాధవి శంకుస్థాపన చేయటం జరిగింది. అనంతరం పార్కు లో కలియ తిరుగుతూ, వాకర్స్ తో ముచ్చటించి, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… అన్నమయ్య పార్కును గతంలో సందర్శించడం జరిగింది. ఈ క్రమంలో పార్క్ కు రిటైనింగ్ వాల్ అవసరం ఉందని పార్క్ కమిటీ సభ్యులు, స్థానిక కార్పొరేటర్ మానం పద్మ శ్రీ మా దృష్టికి తీసుకొని రావటం జరిగింది. వీటన్నింటిని పరిశీలించి ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.50 లక్షలతో అంచనాలు రూపొంచించి నేడు శంకుస్థాపన చేయటం జరిగింది. రాబోయే 2,3 నెలల్లోనే ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొని వస్తాము. అదే విధముగా ఈ పార్కు లో మంచి నీటిని నింపితే సుందరంగా ఉండడంతో పాటు, తమ ప్రాంతాలో భూగర్భ జలాలు పెరుగుతాయని, అలాగే వెంకటేశ్వర స్వామి వారి తెప్పోత్సవం నిర్వహించుకోవటానికి బాగుంటుంది అని విజ్ఞప్తి చేశారు. అయితే దీని సాధ్యాసాధ్యాలు పరిశీలిద్దాము. ఇటువంటి కార్యక్రమాలు ప్రారంభించటానికి ప్రభుత్వంతో పాటు ప్రజల సహాయ సహకారాలు ఉంటే పని త్వరగా పూర్తి అవుతుంది. కాబట్టి దాతలు ముందుకు వస్తే, మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో అన్నమయ్య పార్కును అభివృద్ధి చేద్దామని ఎమ్మేల్యే గళ్ళా మాధవి కోరారు. ఎన్టీఆర్ స్టేడియం నుండి హనుమయ్య కంపెనీ వరకు రోడ్డు విస్తరణ పనులు చేయాలని స్థానిక ప్రజలు, స్థానిక కార్పొరేట్ మా దృష్టికి తీసుకొని వచ్చారు. దీని మీద దృష్టి పెట్టి త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.