రాష్ట్రంలో కుల గణన ప్రక్రియను వెంటనే చేపట్టాలని బీసీ హక్కుల పోరాట సమితి ఫౌండర్ ప్రెసిడెంట్
తాడిబోయిన చంద్రశేఖర్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరులోని బీసీ నాయకులు అచ్చి కిరణ్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కులగనన చేయడం ద్వారానే బీసీల సంక్షేమ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. వెనుకబడిన వర్గాల ఆర్థిక రాజకీయ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బీసీల సమస్యల పరిష్కారం కోసం త్వరలో పోరాటాలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శిగా బోయిన లక్ష్మయ్య యాదవ్ ను నియమించారు. రాష్ట్రంలో సంఘాన్ని మరింత బలోపేతం చేసి, బీసీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో బీసీ నేతలు
హనుమత్ రాజు, విఠల్, శంకర్రావు పాల్గొన్నారు.