ఆంధ్రప్రదేశ్

AP NEWS: డైనమిక్ సీఎం చంద్రబాబు పాలనా స్ఫూర్తితో సత్యసాయి జిల్లాలోనూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాము

AP MINISTERS PRESS MEET

ఉమ్మడి అనంతపురం జిల్లాపై సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించారని, సోలార్, ఇండస్ట్రియల్ హబ్ గా అభివృద్ధి చేయనున్నారని మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఎస్.సవిత, గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్ యాదవ్ ఓకే చేశారు. తమ అవినీతి బాగోతాలు బట్టబయలవుతున్నాయనే జగన్ డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను బయటకు తీస్తామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని మంత్రులు స్పష్టంచేశారు. మడకశిర పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామితో కలిసి మాట్లాడారు. ముందుగా జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలో పార్టీ అంతర్గత సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా ఆస్తులను ఈడీ అటాచ్ చేస్తున్న విషయం తెలుసుకుని, డైవర్షన్ రాజకీయాలకు వైసీపీ నాయకులు తెరతీశారన్నారు. వైసీపీ నాయకులకు హిందూత్వం మీద నమ్మకం లేదన్నారు. టీటీడీలో వైసీపీ నాయకులు టిక్కెట్ల విక్రయాల అక్రమాలను కూడా బయటకు తీస్తామన్నారు. ప్రతి గోవుకు జియో ట్యాగింగ్ చేశామని, గో సంరక్షణ భేషుగ్గా ఉందని అందరూ కితాబునిస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థల్లో జరిగిన అవినీతిని వెలికితీయనున్నట్లు ఇన్చార్జి మంత్రి అనగాని స్పష్టంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి సవిత తెలిపారు కర్నాటక బోర్డర్ లోఉన్న మడకశిర అభివృద్ధికి ఇటీవల సీఎ చంద్రబాబు వరాలు కురిపించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఉమ్మడి అనంతరం జిల్లా అంటే సీఎం చంద్రబాబుకు ఎంతో ఇష్టమన్నారు. ఈరోజు సాగునీరు, తాగునీరు అందుతున్నాయంటే అందుకు కారణం సీఎంచంద్రబాబునాయుడేనన్నారు. 2019-24లో గొల్లపల్లి రిజర్వాయర్ ను నిర్మించారని, కియా మోటారు పరిశ్రమను తీసుకొచ్చారని తెలిపారు. హెచ్ఎన్ఎస్ కాలువ కోసం సీఎం చంద్రబాబుతోనూ, లోకేశ్ తోనూ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, తిప్పేస్వామి తరుచూ మాట్లాడుతున్నారన్నారు. మడకశిరలోని చివరి ఎకరాకు కూడా సాగు నీరందిస్తామన్నారు. మడకశిరలో సాగవుతున్న ఒక్క పంటను దృష్టిలో పెట్టుకుని, ఒక్క ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపిన విషయాన్నిమంత్రి గుర్తుచేశారు. మరికొన్నిపరిశ్రమలు కూడా తీసుకురాబోతున్నారన్నారు. సత్యసాయి జిల్లాలో అత్యధికంగా అభివృద్ధి జరుగుతున్న నియోజక వర్గం మడకశిర అని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు …. మంత్రులు, ఎంపీలను కలిసి నిధులు ఎక్కువగా రాబట్టుకుని, నియోజకవర్గంలో అభివృద్ధికి విశేష కృషిచేస్తూ మడకశిర రూపురేఖలు మార్చుతున్నారని కొనియాడారు. సూర్య ఘర్ కింద సోలార్ నిధులు ఎక్కువగా తీసుకొస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు అని తెలిపారు. మడకశిరలోని ఎంజేపీ స్కూల్ భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఈ భవనాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button