ఆంధ్రప్రదేశ్గుంటూరు
GUNTUR NEWS: పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై సదస్సు
POLITICAL SEMINOR IN GUNTUR
పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన దుష్ఫలితాలు అనే అంశంపై ఈనెల 20వ తేదీన గుంటూరులో సదస్సు జరగనుంది. భారత్ జోడో అభియాన్ వ్యవస్థాపకులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు యోగేంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బీపీ మండల్ సేన ప్రతినిధులు డాక్టర్ అలా వెంకటేశ్వరరావు, తన్నీరు సాంబయ్య, తిరుపతిరావు, శివకుమార్ సుబ్రహ్మణ్యం తదితరులు విడుదల చేశారు. అమరావతి రోడ్డు బి.వి.ఆర్ కన్వెన్షన్ లో జరిగే సదస్సులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. దేశవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే కలిగే లాభ నష్టాలపై వివరించడం జరుగుతుందని వారు వెల్లడించారు.