ఏ పండు తిందామన్నా, హైబ్రిడ్ లేదా రసాయనిక ఎరువులు లేదా మోతాదుకు మించిన పురుగుమందుల అవశేషాల తలంపు నేడు అతిపెద్ద అవరోధంగా అవతరించింది. లాభాల కోసం ఎవరు పాట్లు వారివి.. అయినప్పటికీ ఒక్క తాటి ముంజలు(ICE APPLE) మాత్రమే ప్రకృతి ప్రసాదించిన విధంగా యధావిధిగా మనకు అందించబడుతున్నాయి అనేది వాస్తవం.. తక్కువ ధరలో లభిస్తూ, అధిక పోషక విలువలు కలిగి క్యాన్సర్ ను జయించుటలో కూడా సహాయపడతాయి అన్న విషయం మనకు తెలిస్తే అస్సలు వాటిని వదిలిపెట్టము కూడా. అయితే షుగర్ మరియు లివర్ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఇవి తింటే సమస్యలు అధికమవుతాయి కనుక వైద్యుని సలహా పై నిర్ణయం తీసుకోవాలి..
231 Less than a minute