బ్రాడిపేటలోని డి.వై.ఎఫ్.ఐ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వై. కృష్ణ కాంత్ అధ్యక్షతన డి.ఎస్సీ పై అవగాహాన సదస్సు జరిగింది. వచ్చిన అభ్యర్థులు ఇచ్చే ఉచిత మెటీరియల్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె.యస్.లక్ష్మణరావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల ఆందోళన ఫలితంగా నేడు డి.ఎస్.సి నోటిఫికేషన్ వచ్చిందన్నారు. ఈ నోటిఫికేషన్‌పై అభ్యర్ధులు 4 ప్రధాన అభ్యంతరాలను తెలుపుతున్నారన్నారు. కొంత మంది అభ్యర్ధులు వయోపరిమితిని 47 సం॥రాలకు పెంచాలని, మరికొంత మంది డిగ్రీలో క్వాలిఫైడ్ మార్క్స్ 50% నుండి 40% కి తగ్గించాలని, సిలబస్ రిత్యా 45 రోజులు కాలపరిమితిని 90 రోజులుకి పెంచాలని, ఒకే జిల్లాకి ఇకే పేపర్ కావాలని కోరుతున్నారని వారి అభ్యతంరాలను పరిష్కరించాలని ఇప్పటికే డి.వై.ఎఫ్.ఐ అభ్యర్ధులతో కలిచి ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా అభ్యర్ధులు పరీక్షకు ప్రణాళిక బద్ధంగా చదివి విజయం సాధించాలని ఆకాంక్షించారు. డి.ఎస్.సి సిలబస్ ఏమి చదవాలి, ఎలా చదవాలి అనేది వివరించారు. డి.వై.ఎఫ్.ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న మాట్లాడుతూ ప్రభుత్వాలు ఇప్పటికి వరకు అభ్యర్ధులను రోడ్లుమీదకు రాకుండా ఉండే విధంగా నోటిఫికేషన్స్ ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ కావాలని, వచ్చినతర్వాత పలు రకాల సమస్యలు పరిష్కరించాలని నిరంతరం ఆందోళన చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వాలు కల్పిస్తున్నాయన్నారు. ఎటువంటి అభ్యంతరాలకు, న్యాయమైన వివాధానాలకు తావులేకుండి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి నేడు అభ్యర్ధులను రోడ్లుఎక్కేవిధంగా చేశారన్నారు. ఇప్పటికైనా అభ్యర్ధులు కోరుతున్నా 4 ప్రధాన అభ్యంతరాలను పరిష్కరించాలని డిమాండ్ చేసారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన నిర్వహిస్తానే పరీక్షకు ప్రణాళిక అబద్ధంగా రిపేర్ కావాలని జరగబోయే డీఎస్సీలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అభ్యర్థుల యొక్క ఆవేదనని అర్థం చేసుకొని సమస్యలు పరిష్కారానికి పూనుకోవాలని కోరారు.
232 1 minute read