Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

AP NEWS: మ‌న‌మిత్ర‌ను మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి – అన్ని సేవ‌లూ ప్ర‌జ‌ల‌కు వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌లో అందించాలి

AP CS MEETING WITH OFFICIALS

మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ను ప్ర‌జ‌ల్లోకి మరింత‌గా తీసుకెళ్లి, ప్ర‌భుత్వ సేవ‌ల‌న్నీ వారు మ‌న‌మిత్ర‌లో పొందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. విజ‌యానంద్ అధికారుల‌ను ఆదేశించారు. స‌చివాల‌యంలోని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ క‌మాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆయ‌న సోమ‌వారం ఆర్టీజీఎస్ కార్య‌క‌లాపాల‌పైన స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ సేవ‌ల ప్ర‌గ‌తి గురించి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. జూన్ 12వ తేదీలోపు మ‌న‌మిత్ర ద్వారా ప్ర‌జ‌ల‌కు 500 రకాల సేవ‌లు ఇచ్చేలా అధికారులు ప‌నిచేయాల‌న్నారు. ప్ర‌జ‌లు ఎవ్వ‌రూ కూడా త‌మ ప‌నుల కోసం ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, అధికారుల చుట్టూ తిర‌గ‌న‌వ‌సం లేకుండా అన్ని సేవ‌లు మ‌న‌మిత్ర ద్వారా పొందేలా చేయ‌డ‌మే ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆశ‌య‌మ‌న్నారు. ఆ దిశ‌గా మ‌న‌మిత్ర‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌న్నారు. ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డంలో స‌చివాల‌య సిబ్బంది కీల‌క పాత్ర పోషించాల‌న్నారు. ఆర్టీజీఎస్‌లో డేటా అనుసంధాన ప్ర‌క్రియ కూడా ల‌క్ష్యాల మేర‌కు పూర్త‌య్యేలా చూడాల‌న్నారు. డేటా అనుసంధానంతో ప్ర‌జ‌ల‌కు మ‌రింత మెరుగైన సేవ‌లందించేలా ఆర్టీజీఎస్ సాంకేతిక సహ‌కారాన్ని ఆయా శాఖ‌ల‌కు అందించ‌డానికి వీల‌వుతుంద‌న్నారు. పంచాయ‌తీరాజ్ విభాగాధికారుల‌నుద్దేశించి మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యం, చెత్త‌తొలగింపు ప‌నుల్లో కొంత పురోగ‌తి క‌నించింద‌ని, అయితే పారిశుద్ధ్య మరింత మెరుగుప‌డాల‌న్నారు. గ్రామాలు ప‌రిశుభ్రంగా క‌నిపించేలా చేయాల‌న్న‌దే ప్ర‌భుత్వ ఆశ‌య‌మ‌న్నారు. ఆర్టీసీ సేవ‌ల్లో కూడా మ‌రింత ప్ర‌గ‌తి సాధించాల‌ని సూచించారు. డ్రోన్ మార్ట్ వెబ్ పోర్ట‌ల్‌ను ముఖ్య‌మంత్రి చేతుల‌మీదు ప్రారంభించ‌డానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాల‌ని సూచించారు. సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పోర్ట‌ల్‌ను రూపొందించాల‌ని సూచించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button