Bapatla District news :సెయింట్ ఆన్స్‌లో రోబోటిక్ టెక్నాలజీస్‌పై వర్క్‌షాప్-విద్యార్థులకు రోబోటిక్స్, ఆర్డినో, రోబోట్ ప్రోగ్రామింగ్‌పై శిక్షణ

Sharat
4 Views

వేటపాలెం, సెప్టెంబర్ 19:– చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో రోబోటిక్ టెక్నాలజీస్‌పై నిర్వహించిన మూడు రోజుల వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ నెల 17 నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో బీటెక్ 3, 4వ సంవత్సరం విద్యార్థులకు ఈ వర్క్‌షాప్ నిర్వహించారు.

ఆధునిక సాంకేతిక రంగంలో రోబోటిక్ టెక్నాలజీస్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ప్రాక్టికల్ అవగాహన కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. జగదీష్ బాబు తెలిపారు. వర్క్‌షాప్‌లో రోబోటిక్స్, ఆర్డినో ఫండమెంటల్స్, రోబోట్ ప్రోగ్రామింగ్, మొబైల్ రోబోట్ ప్రోగ్రామింగ్ అంశాలపై శిక్షణతో పాటు విద్యార్థులతో ప్రయోగాలు నిర్వహించినట్లు చెప్పారు.

ఇడినో రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బాజి బాషా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించినట్లు మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మీతులసి చావలి తెలిపారు. విద్యార్థులు రోబోటిక్ టెక్నాలజీపై ప్రాక్టికల్ పరిజ్ఞానం పొందేందుకు వర్క్‌షాప్ ఉపయోగపడిందన్నారు.Bapatla Distric News

వర్క్‌షాప్‌కు పి. హరీష్, బి. రవికుమార్ కన్వీనర్లుగా వ్యవహరించారు. ముగింపు కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల కార్యదర్శి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు వర్క్‌షాప్ విజయవంతం కావడంపై నిర్వాహకులను అభినందించారు.

Author
Share This Article
Leave a review