GUNTUR DISTRICT NEWS: గుంటూరులో ఉత్సాహంగా యోగా ఆసనాల పోటీలు

Karthik

గుంటూరులోని హౌసింగ్ బోర్డు కాలనీ మున్నంగి ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ యోగా అసోసియేషన్‌కు అనుబంధంగా గుంటూరు జిల్లా యోగాసన ఛాంపియన్‌షిప్ ఆధ్వర్యంలో యోగాసన ప్రదర్శన, పోటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ పోటీలలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి, యోగా టీచర్ జటవత్ వెంకటేష్ నాయక్ పాల్గొని తన యోగాసన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మాస్టర్స్ మెన్ ఏ గ్రూప్ పోటీలో ఆయన 3వ స్థానాన్ని సాధించారు. ఈ సందర్భంగా జటవత్ వెంకటేష్ నాయక్ మాట్లాడుతూ, యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, యోగా సాధన ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను పొందవచ్చని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత ప్రతిరోజూ యోగాను సాధన చేయడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. యోగాపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు, యువతలో యోగాసనాలపై ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు, కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. యోగాసన పోటీలో తృతీయ స్థానం సాధించిన జటవత్ వెంకటేష్ నాయక్‌ను కార్యక్రమ నిర్వాహకులు, యోగా అసోసియేషన్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, పలువురు ప్రముఖులు అభినందించారు అనంతరం భారత్ యోగా ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ అల్లాడి రవికుమార్ చేతులు మీదగా బహుమతి పత్రం అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండా. శ్రీలత, శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review