GUNTUR DISTRICT NEWS: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం

Karthik

జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షాల తీవ్రత, తుఫాను ప్రభావం మరియు ప్రజల భద్రతకు సంబంధించి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సెల్ కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉన్న 28 ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బందిని అప్రమత్తంగా ఉంచారు.భారీ వర్షాల కారణంగా రహదారులపై నీరు నిలిచిపోవడం, గుంతలు కనిపించకపోవడం, చెట్లు విరిగిపడటం వంటి పరిస్థితుల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.ప్రజలు అత్యవసర పరిస్థితి లేని సమయంలో అనవసర ప్రయాణాలను మానుకోవాలని, ముఖ్యంగా పిల్లలను బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాల సమయంలో రోడ్లపై నీటి ప్రవాహాలు, చెరువులు, కాలువలు మరియు ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని తెలిపారు. విరిగిపడిన చెట్లను తొలగించి రాకపోకలు పునరుద్ధరణభారీ వర్షాల నేపథ్యంలో తాడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాం చప్తా వద్ద రహదారిపై విరిగిపడిన చెట్లను తాడికొండ సీఐ గారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ సహాయక చర్యలు చేపడుతున్నారు.జిల్లాలో ఎక్కడైనా వర్షాల కారణంగా రహదారులు, చెట్లు లేదా ఇతర సమస్యలు ఏర్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించి, ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు. భారీ వర్షాల సమయంలో ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.

Author
Share This Article
Leave a review