జాతీయ రహదారి వద్ద ఎంఎస్కే గ్రౌండ్స్ లో 2 రోజుల పాటు నిర్వహించిన అమరావతి ఛాలెంజెస్ ట్రోఫీ టోర్నమెంట్ ముగిసింది. ఏపీ స్టేట్ సెలెక్షన్ ట్రైల్స్ 2026 2027 పేరుతో బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.ఈ టోర్నమెంట్ లో 3 టీంలు పాల్గొనగా ఆంధ్ర ఎల్లో జట్టు విజేతగా నిలిచింది. మంగళవారం నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో జీఎస్టీ అసిస్టెంట్ కమీషనర్ రవీంద్ర బాబు, అర్జున్ అవార్డు గ్రహీత ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడారు. కంటి చూపు లేకుండా సమాజంలో జీవించడం చాలా కష్టంగా ఉంటుందన్నారు.నేత్రదానం చేయడం ద్వారా బ్లైండ్ పీపుల్స్ కి చూపును ఇవ్వొచ్చు అని చెప్పారు.కలలు కని, సాకారం చేసుకోవడానికి అందరూ ప్రయత్నం చేయాలని సూచించారు.భారత దేశంలో ఉన్న యువతీ యువకుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మన దేశానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తోందని తెలిపారు. అదేవిధంగా డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈగల్ టీం చేపట్టిన పల్లె బాట కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని చెప్పారు. డ్రగ్స్ అంటే ఆరోగ్య సమస్య కాదని, జాతీయ భద్రతా సమస్య అని ఆయన వెల్లడించారు. మాదక ద్రవ్యాలు విక్రయం, వినియోగం ఎక్కడ చూసినా వెంటనే సమాచారం ఇవ్వాలని రవికృష్ణ సూచించారు.
GUNTUR DISTRICT NEWS: ఉత్సాహంగా సాగిన అంధుల క్రికెట్ టోర్నమెంట్

Oplus_16908288
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
27°C
Vijayawada
scattered clouds
27° _ 27°
82%
1 km/h
Wed
35 °C
Thu
33 °C
Fri
33 °C


