
పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. లుక్ స్వచ్ఛంద సంస్థ
విజయవాడ కమిటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుడగ జంగాలు కాలనీలో బియ్యం, కందిపప్పు, వంటనూనె, గోధుమ పిండి వంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లుక్ కల్చర్ మీడియా సంస్థ ప్రతినిధులు
డాక్టర్ డి. రాజశేఖర్ ,
డాక్టర్ కే సుధీర్ కుమార్, డాక్టర్ ఎన్. బావాసింగ్ నాయక్, డాక్టర్ కే. మధుబాబు, జే. అనిల్ కుమార్, డాక్టర్ వసంతరావు. రాజేష్, ఎన్. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పేదల కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు వారు పేర్కొన్నారు. పేద వర్గాలు విద్యా, ఉపాధి, ఆర్థికపరంగా బలోపేతం అయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పారు.








