
రాష్ట్ర ప్రభుత్వ తీరుని వ్యతిరేకిస్తూ మున్సిపల్ ఇంజనీరింగ్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. అన్ని శాఖల్లో ఉద్యోగులకు వేతనాలు పెంచినప్పటికీ ఇంజనీరింగ్ ఉద్యోగులకు మాత్రం వేతనాలు పెంచలేదని ఉద్యోగుల సంఘం ప్రతినిధి మధుబాబు ఆరోపించారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ గాంధీ పార్క్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ ఉద్యోగులకు
వేతనాలు పెంచాలని, లేని పక్షంలో సమ్మె చేస్తామని గతంలో నోటీసు ఇచ్చినప్పటికీ ప్రభుత్వ నుండి ఎలాంటి స్పందనా రాలేదన్నారు. సీఎం చంద్రబాబును అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇంజనీరింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచే వరకు సమ్మెను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.








